చైనీస్‌ హ్యాండ్‌ గ్రెనేడ్‌ కలకలం | Chinese hand grenade found at medical institute in Imphal | Sakshi
Sakshi News home page

చైనీస్‌ హ్యాండ్‌ గ్రెనేడ్‌ కలకలం

Dec 30 2016 4:57 PM | Updated on Aug 13 2018 3:30 PM

చైనీస్‌ హ్యాండ్‌ గ్రెనేడ్‌ కలకలం - Sakshi

చైనీస్‌ హ్యాండ్‌ గ్రెనేడ్‌ కలకలం

రీజనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌) ఆవరణలో చైనా హ్యాండ్‌ గ్రెనేడ్‌ కలకలం సృష్టించింది.

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చైనీస్‌ హ్యాండ్‌ గ్రెనేడ్‌ ఒకటి కలకలం రేపింది. ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని రీజనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌) ఆవరణలో దీనిని గుర్తించారు.

మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌కు వచ్చిన వారు శుక్రవారం కొత్త వస్తువేదో కనిపించడంతో దానిని ఆసక్తిగా గమనించారు. చివరికి దానిని ఒక గ్రెనేడ్‌గా గుర్తించి అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అనంతరం మణిపూర్‌ పోలీస్‌ బాంబ్‌ స్క్వాడ్‌ దానిని నిర్వీర్యం చేసినట్లు అధికారులు వెల్లడించారు. చైనీస్‌ గ్రెనేడ్‌ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. రిమ్స్ ఆవరణలోకి అది ఎలా వచ్చింది అనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement