ఛోటా భీమ్-ఇందుమ‌తి‌ పెళ్లి: నిజ‌మేనా? | Chhota Bheem Marry Chutki: Makers Says They Are Still Kids | Sakshi
Sakshi News home page

ఛోటా భీమ్..‌ చుట్కీని ఒంట‌రిదాన్ని చేశాడా?

Jun 5 2020 4:16 PM | Updated on Jun 5 2020 7:01 PM

Chhota Bheem Marry Chutki: Makers Says They Are Still Kids - Sakshi

పిల్ల‌ల నుంచి యువ‌తీయువ‌కుల వ‌ర‌కు అంద‌రికీ ఎంత‌గానో న‌చ్చే కార్టూన్ ప్రోగ్రాంలో "చోటా భీమ్" అగ్ర‌స్థానంలో ఉంటుంది. లాక్‌డౌన్ పుణ్య‌మాని అంద‌రూ మ‌రోసారి ఈ యానిమేష‌న్ ప్రోగ్రామ్ వీక్షిస్తూ కాల‌క్షేపం చేస్తున్నారు. కాగా "ఛోటా భీమ్" కార్టూన్‌ విష‌యానికొస్తే.. ఢోల‌క్ పూర్ అనే ప‌ల్లెటూరిలో తొమ్మిదేళ్ల ఛోటా భీమ్ అనే శ‌క్తివంతుడైన కుర్రాడు ఉంటాడు. ఎవ‌రికి ఆప‌ద వ‌చ్చినా త‌క్ష‌ణ‌మే భీమ్ వారిని ర‌క్షిస్తాడు. అయితే అత‌నికి ఎంతో ఇష్ట‌మైన ల‌డ్డూ తింటే గానీ శ‌త్రువుని ఎదిరించ‌లేడు. ఇక‌ ఛోటా భీమ్‌కు చుట్కీ, రాజు, జ‌గ్గు అనే కోతి, ఆ ఊరి రాజుగారి కూతురు ఇందుమ‌తి స్నేహితులు. (బుజ్జి బుజ్జి మాటలు)

ఇందులో చుట్కీ.. భీమ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌. అయితే తాజాగా ఛోటా భీమ్ ఇందుమ‌తిని పెళ్లి చేసుకున్నాడంటూ సోష‌ల్ మీడియాలో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. "లేదు, వీల్లేదు, భీమ్.. చుట్కీకి అన్యాయం చేయ‌కూడ‌దు" "చుట్కీని ఒంట‌రిగా వ‌దిలేయ‌కు భీమ్.."‌ అంటూ నెటిజ‌న్లు కోరుతున్నారు. దీంతో ట్విట‌ర్‌లో గురువారం #JusticeForChutki ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై స్పందించిన కార్టూన్ నిర్వాహ‌కులు గ్రీన్ గోల్డ్ యానిమేష‌న్స్ అదంతా అబ‌ద్ధ‌మ‌ని కొట్టిపారేసింది. భీమ్‌-ఇందుమ‌తి వివాహం వుట్టి పుకారేన‌ని స్ప‌ష్టం చేసింది. భీమ్‌, చుట్కీ, ఇందుమ‌తి ఇంకా చిన్న‌పిల్ల‌లే అని, వారి మ‌ధ్య ప్రేమ‌, పెళ్లి అనే విష‌యాల‌ను జోడించ‌కండి అని సెల‌విచ్చింది. దీంతో శాంతించిన అభిమానులు "న్యాయం జ‌రిగింది" అంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. (‘చోటా భీమ్‌’కు కేటీఆర్‌ అభినందనలు)

Advertisement
 
Advertisement
Advertisement