కావేరి బోర్డు ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి

As Centre delays draft proposal of Cauvery Board, angry - Sakshi

న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలు వివరిస్తూ మే 8 లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కావేరి బోర్డును నియమించే బాధ్యత కేంద్రానిదేనని, ఇందులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు సూచించింది.

తమ ఆదేశాల మేరకు కావేరి జలాశయాల నుంచి తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కార కేసుగా భావించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కోరుతామని హెచ్చరించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారని, విచారణను పోలింగ్‌ ముగిసే దాకా వాయిదా వేయాలని వేణుగోపాల్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం పక్షపాత ధోరణితో  సమాఖ్య విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తమిళనాడు ఆరోపించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top