27 మాజీ ఎంపీలకు షాక్‌

Central Government Fire On 27 Ex MPs For Not Vacate Official Bungalows - Sakshi

ఢిల్లీ: అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎంపీలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. దీంతో 27 మంది మాజీ పార్లమెంట్‌ సభ్యులకు మంగళవారం కేంద్రం ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. మాజీ ఎంపీలు పదవీ కాలం ముగిసినప్పకీ ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీల ఇళ్లకు నీళ్లు, కరెంట్‌, గ్యాస్‌ కనెక‌్షన్లు వెంటనే నిలివేయాలని లోక్‌సభ హౌస్‌ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మాజీలు భవనాలను ఖాళీ చేయాలని హెచ్చరించింది. కాగా ల్యూటెన్స్‌ ఢిల్లీలోని ఎంపీల అధికారిక భవనాల నుంచి ఇంకా 82 మంది మాజీలు ఖాళీ చేయాల్సి ఉందని గతంలో అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయని ఎంపీల వైఖరిపై ప్రభుత్వం మండిపడింది. మాజీ ఎంపీల నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ప్రస్తుత ఎన్నికైన ఎంపీలకు వేరేచోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.   

చదవండి: బంగళాలు వీడని మాజీలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top