ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీ శుక్రవారం ప్రకటించారు.
	దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీ శుక్రవారం ప్రకటించారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలును జైదీ విడుదల చేశారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు వివిధ రాష్ట్రాలకు వివిధ రోజుల్లో  ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 140, తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్‌లో 294, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. కేరళలో 21వేలు, తమిళనాడులో 65వేలు, పశ్చిమ బెంగాల్‌లో 77వేలు, పుదుచ్చేరిలో 913 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉంటాయని జైదీ తెలిపారు. అన్నిచోట్లా ఈవీఎంలనే ఉపయోగిస్తామని అన్నారు. నోటాకు కూడా ప్రత్యేక గుర్తును ఈ ఎన్నికల నుంచి కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఈవీఎంలకు ప్రింటర్లు జతచేస్తున్నామని అన్నారు. అభ్యర్థులందరి ఫొటోలను కూడా ఈవీఎంలలో ఉంచుతామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అసోంలో 2 దశలలోను, పశ్చిమబెంగాల్‌లో 6 దశలలోను, మిగిలిన మూడు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే దశలోను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల  ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మే 19వ తేదీన ఉంటాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ మే 21 నాటికి ముగుస్తుందని నసీం జైదీ ప్రకటించారు.
	
	అసోం
	
	తొలి దశ 65 నియోజకవర్గాలు
	నోటిఫికేషన్ జారీ: మార్చి 11
	నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి
	నామినేషన్ల పరిశీలన: 19 మార్చి
	ఉపసంహరణ గడువు: 21 మార్చి
	పోలింగ్ తేదీ: 4 ఏప్రిల్ (సోమవారం)
	
	రెండోదశ 61 నియోజకవర్గాలు
	నోటిఫికేషన్ జారీ: మార్చి 14
	నామినేషన్ల ముగింపు తేదీ: 21 మార్చి
	నామినేషన్ల పరిశీలన: 22 మార్చి
	ఉపసంహరణ గడువు: 26 మార్చి
	పోలింగ్ తేదీ: 11 ఏప్రిల్ (సోమవారం)
	
	పశ్చిమబెంగాల్
	 
	తొలి దశ 18 నియోజకవర్గాలు (రెండుసార్లుగా జరుగుతుంది)
	నోటిఫికేషన్ జారీ: 11 మార్చి, 21 మార్చి
	నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి, 22 మార్చి
	నామినేషన్ల పరిశీలన: 19 మార్చి, 26 మార్చి
	పోలింగ్ తేదీలు: 4 ఏప్రిల్, 11 ఏప్రిల్
	
	రెండోదశ 56 నియోజకవర్గాలు
	నోటిఫికేషన్ జారీ: 22 మార్చి
	నామినేషన్ల ముగింపు తేదీ: 29 మార్చి
	నామినేషన్ల పరిశీలన: 30 మార్చి
	ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 1
	పోలింగ్ తేదీ: 17 ఏప్రిల్
	
	మూడోదశ 62 నియోకవర్గాలు
	నోటిఫికేషన్ జారీ: 28 మార్చి
	నామినేషన్ల ముగింపు తేదీ: 4 ఏప్రిల్
	నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్
	ఉపసంహరణ గడువు: 7 ఏప్రిల్
	పోలింగ్ తేదీ: 21 ఏప్రిల్
	
	నాలుగోదశ 49 నియోజకవర్గాలు
	నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 1
	నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 4
	నామినేషన్ల పరిశీలన: 9 ఏప్రిల్
	ఉపసంహరణ గడువు: 11 ఏప్రిల్
	పోలింగ్ తేదీ: 25 ఏప్రిల్
	
	ఐదోదశ 53 నియోజకవర్గాలు
	నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 4
	నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 11
	నామినేషన్ల పరిశీలన: 12 ఏప్రిల్
	ఉపసంహరణ గడువు: 16 ఏప్రిల్
	పోలింగ్ తేదీ: 30 ఏప్రిల్
	
	ఆరోదశ 25 నియోజకవర్గాలు
	నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 11
	నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 18
	నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 19
	ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 21
	పోలింగ్ తేదీ: మే 5
	
	కేరళ 140 నియోజకవర్గాలు ఒకేదశ
	
	నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
	నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
	నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
	ఉపసంహరణ గడువు: 2 మే
	పోలింగ్ తేదీ: 16 మే
	
	
	తమిళనాడు 234 నియోజకవర్గాలు ఒకే దశ
	
	నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
	నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
	నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
	ఉపసంహరణ గడువు: 2 మే
	పోలింగ్ తేదీ: 16 మే
	
	పుదుచ్చేరి 30 నియోజకవర్గాలు ఒకేదశ
	
	నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
	నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
	నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
	ఉపసంహరణ గడువు: 2 మే
	పోలింగ్ తేదీ: 16 మే
	
	ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ:  మే 19
	ఎన్నికల ప్రక్రియముగింపు 21 మే

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
