సీబీఎస్‌ఈ ఫలితాల్లో సత్తా చాటిన మంత్రి, సీఎం తనయులు

CBSE Class 12 Results Smriti Irani and Sunita Kejriwal Tweets About Their Sons Marks - Sakshi

న్యూఢిల్లీ : స్త్రీలు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే..  సంతానం విషయానికి వచ్చేసరికి ఒకేలా స్పందిస్తారు. పిల్లలు గెలిస్తే అందరికన్నా ఎక్కువ వారే సంతోషపడతారు.. ఓడితే పిల్లలకు ధైర్యం చెబుతారు. ఇందుకు నిదర్శనంగా నిలిచారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య సునీత కేజ్రీవాల్‌. ఇంతకు విషయం ఏంటంటే..  గురువారం సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.  ఈ ఫలితాల్లో కేజ్రీవాల్ కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ 96.4 శాతం, స్మృతి ఇరానీ కొడుకు జోహర్‌ 91 శాతం మార్కులు సాధించి వారి తల్లిదండ్రుల ఆనందానికి కారణమయ్యారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు సునీత కేజ్రీవాల్‌, స్మృతి ఇరానీ.  

‘దేవుడి దయ, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో మా అబ్బాయి సీబీఎస్‌సీ 12వ తరగతి ఫలితాల్లో 96.4 పర్సంటైల్‌ను సాధించాడు. అత్యంత కృతజ్ఞతాభావంతో’ అని సునీత ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా..‘బిగ్గరగా చెప్పడం కరెక్టే. మా అబ్బాయి జోహర్‌ పట్ల చాలా గర్వంగా ఉంది. ప్రపంచ కెంపో ఛాంపియన్‌ షిప్‌లో క్యాంస పతకం సాధించడంతో పాటు  సీబీఎస్‌సీలో మంచి స్కోర్‌ సాధించాడు. ఆర్థిక శాస్త్రంలో 94 శాతాన్ని సాధించినందుకు స్పెషల్ యాహూ. నన్ను క్షమించండి. ఈ రోజు నేను అత్యంత సంతోషకరమైన అమ్మను’ అని పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం వెల్లడైన ఈ ఫలితాల్లో 83.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top