తూత్తుకుడి: సీబీఐతో విచారణ జరిపించాలి

సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారం విస్తరణను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. కాల్పులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నేడు తమిళనాడు వ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చాయి. బంద్‌లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో సహా కాంగ్రెస్, వామపక్షలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. బంద్‌లో పాల్గొన్న డీఎంకే నేత కనిమొళితో సహా, ఇతర ప్రధాన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా తుత్తుకుడి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయవాది జీఎస్ మణి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు అవకాశం ఉంది. కాగా పిటిషన్‌లో పూర్తి వివరాలను పొందుపరిచి సోమవారం మరో పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాదిని ఆదేశించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి