
న్యూఢిల్లీ: సీబీఐకి రూ.698.38 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇది 2.79 శాతమే అధికం. గత ఐదు బడ్జెట్లలో అతి తక్కువ పెంపు కూడా ఇదే కావడం గమనార్హం. సీబీఐ ఈ–గవర్నర్స్, శిక్షణ కేంద్రాల ఆధునీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్ అనుబంధ యూనిట్ల స్థాపన, సీబీఐ శాఖల కార్యాలయాల నిర్మాణం తదితరాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నారు.