దేశ వ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ సోదాలు

CBI carries out joint surprise checks at 150 places across country - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 150 చోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోని సంస్థల్లో సీబీఐ విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, గువాహటి, శ్రీనగర్, షిల్లాంగ్, చండీగఢ్, సిమ్లా, చెన్నై, మదురై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, గాంధీనగర్, గోవా, భోపాల్, జబల్‌పూర్, నాగ్‌పూర్, పట్నా, రాంచీ, ఘజియాబాద్, లక్నో, డెహ్రాడూన్‌లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో అవినీతికి ఆస్కారమున్న సంస్థల్లో సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top