ఢిల్లీ మెట్రో రెల్వే కార్పొరేషన్, సాహిత్య అకాడమీ సంయుక్తంగా భారతీయ సాహిత్యసేవకు నడుంబిగించాయి. ఇందులో భాగం గా బుక్‌స్టాల్స్‌ను ఏర్పాటు చేసి, అత తక్కువ ధరలకే
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రెల్వే కార్పొరేషన్, సాహిత్య అకాడమీ సంయుక్తంగా భారతీయ సాహిత్యసేవకు నడుంబిగించాయి. ఇందులో భాగం గా బుక్‌స్టాల్స్‌ను ఏర్పాటు చేసి, అత తక్కువ ధరలకే పుస్తకాలను విక్రయించడానికి నిర్ణయించాయి. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాహిత్య అకాడమీ, డీఎంఆర్‌సీలు కలిసి అవగాహన కుదుర్చుకొన్నాయి. మెట్రోభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎం ఆర్‌సీ జనరల్ మేనేజర్(ఆపరేషన్స్) వికాస్ కుమార్, సాహిత్య అకాడమీ సెక్రెటరీ డీఆర్ కే. శ్రీనివాస్‌రావు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం కాశ్మీర్ గేట్, విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్‌లల్లో డీఎంఆర్‌సీ స్థలాన్ని కేటాయిస్తోంది. ఇందులో భాగంగా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మూడేళ్ల ఒప్పందం మేరకు బుక్‌స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. 15 శాతం డిస్కౌంట్‌పై పలు సాహిత్య పుస్తకాలను అన్ని మెట్రో స్టేషన్ల అందుబాటులో ఉంచనుంది.


