ఢిల్లీలో నిత్యం రద్దీగా ఉండే ఓ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపారు.
ఢిల్లీలో నిత్యం రద్దీగా ఉండే ఓ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపారు. సోమవారం మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు జితేందర్ సింగ్ (39)పై దాడి చేసినట్టు పోలీసులు చెప్పారు. ఆయనపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపి వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్టు తెలిపారు. ఢిల్లీలోని తిలక్నగర్ ప్రాంతంలో ఆయన ఆఫీసు బయట ఈ సంఘటన జరిగింది.
జితేందర్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వ్యకిగత వైరంతో ఈ దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. జితేందర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల్ని విచారిస్తున్నారు.