బంగారం @ 1,13,800 | Gold new record high of Rs 1,13,800 in Delhi markets | Sakshi
Sakshi News home page

బంగారం @ 1,13,800

Sep 13 2025 1:45 AM | Updated on Sep 13 2025 1:45 AM

Gold new record high of Rs 1,13,800 in Delhi markets

మరో కొత్త గరిష్ట స్థాయి 

రూ.1,32,000 వద్ద వెండి రికార్డు

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. శుక్రవారం ఈ విలువైన లోహాలు సరికొత్త జీవిత కాల గరిష్టాలకు చేరాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.700 పెరగడంతో రూ.1,13,800 స్థాయిని నమోదు చేసింది. వెండి కిలోకి ఏకంగా రూ.4,000 పెరిగి 1,32,000ను తాకింది. అంతర్జాతీయంగా బలమైన డిమాండ్‌ ధరలకు మద్దతుగా నిలిచినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘‘ఇటీవలి యూస్‌ ఆర్థిక డేటాతో ఫెడ్‌ 2025లోనే ఒకటికి మించిన విడతల్లో రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలు పెరిగాయి. 

దీంతో బంగారంలో కొనుగోళ్లు పెరిగాయి’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ విభాగం సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. పారిశ్రామిక డిమాండ్‌కు తోడు ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లోకి బలమైన పెట్టుబడుల ప్రవాహంతో వెండి ధరలు పెరిగినట్టు చెప్పారు. ఈ ఏడాది పెట్టుబడిదారులకు బంగారం, వెండి మంచి లాభాన్నిచ్చాయి. ఇప్పటి వరకు బంగారం ధర 10 గ్రాములకు రూ.34,850 (44 శాతం), వెండి ధర కిలోకి రూ.42,300 (47 శాతం) చొప్పున పెరగడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం స్వల్ప లాభంతో 3,683 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement