అమిత్‌ షాకు క్లీన్‌చిట్‌ సబబే!

Bombay HC dismisses PIL that questioned CBI not appealing Amitshah - Sakshi

ముంబై: సొహ్రాబుద్దీన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాలుచేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ కోర్టు 2014లో అమిత్‌ షాను నిర్దోషిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సీబీఐ సవాలుచేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ బాంబే లాయర్ల బృందం ఈ పిల్‌ వేసింది. ఫిర్యాదుదారుడు, బాధితుడు కాని వ్యక్తి లేదా సంస్థ ఈ కేసులో జోక్యం చేసుకోవద్దని జస్టిస్‌ రంజిత్‌ మోరె, జస్టిస్‌ భారతి డాంగ్రెల ధర్మాసనం మందలించింది. ఇందులో తలదూర్చే హక్కు పిటిషన్‌దారులకు లేదని తేల్చిచెప్పింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top