కేంద్ర మాజీమంత్రి నివాసంలో మృతదేహం | Body found at Kumari Selja's house in Delhi | Sakshi
Sakshi News home page

కేంద్ర మాజీమంత్రి నివాసంలో మృతదేహం

Aug 11 2014 10:24 AM | Updated on Apr 3 2019 5:34 PM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కుమారి శెల్జా నివాసంలో సోమవారం ఓ మృతదేహం లభ్యమైంది.

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కుమారి శెల్జా నివాసంలో సోమవారం ఓ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తిని శెల్జా నివాసంలో పనిమనిషి భర్త సంజయ్ (42)గా పోలీసులు గుర్తించారు. అడిషనల్ పోలీస్ కమిషనర్ ఎస్బీఎస్ త్యాగి మాట్లాడుతూ తమకు ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో మృతదేహం గురించి పోలీస్ కంట్రోల్ రూమ్కి శెల్జా నివాసం నుంచి  ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తోంది. సంజయ్ మృతిపై విచారణ జరుపుతున్నట్లు త్యాగి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement