బీజేపీ ఎంపీపై హత్యాయత్నం | BJP MPs assassination attempt | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీపై హత్యాయత్నం

Jun 16 2014 2:44 AM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీ ఎంపీపై హత్యాయత్నం - Sakshi

బీజేపీ ఎంపీపై హత్యాయత్నం

ఇటీవల లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతిపై నలుగురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆదివారం పోలీసులు తెలిపారు.

యూపీలో పాతకక్షలతో దాడి
 
ఫతేపూర్  (యూపీ): ఇటీవల లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతిపై నలుగురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆదివారం పోలీసులు తెలిపారు. అయితే ఆమె సురక్షితంగా బయటపడ్డారని వారు చెప్పారు. ఆమె ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా దుండగులు ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసు సూపరింటెండెంట్ వినోద్ కుమార్ సింగ్ తెలిపారు. పాతకక్షలతోనే ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.

భానూ పటేల్ అనే వ్యక్తి, ముగ్గురు అనుచరులతో కలిసి తనపై కాల్పులు జరిపినట్టు ఎంపీ జ్యోతి తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్పీ వివరించారు. ఈ సంఘటనకు సంబంధించి పటేల్‌ను అరెస్టు చేయగా, అతని ముగ్గురు అనుచరులు పరారీలో ఉన్నారు. కాగా, ఎంపీ జ్యోతి మద్దతుదారులకు వ్యతిరేకంగా భానూ పటేల్ ఫిర్యాదు చేశాడని ఎస్పీ తెలిపారు. ఎంపీ మద్దతుదారులు తనపై కూడా కాల్పులు జరిపినట్టు భానూ అందులో పేర్కొన్నాడు. రెండు కేసులపైనా దర్యాప్తు చేస్తామని ఎస్పీ చెప్పారు. ఈ సంఘటనలో ఎంపీ గన్‌మాన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement