బీజేపీ నాయకురాలిపై సామూహిక అత్యాచారం | BJP leader gangraped in Ranchi | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకురాలిపై సామూహిక అత్యాచారం

Apr 29 2014 2:56 PM | Updated on Mar 29 2019 9:07 PM

జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నాయకురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

రాంచీ: మన దేశంలో సాధారణ మహిళలకే కాదు నాయకులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నాయకురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాంచీ జిల్లా మస్మనొ గ్రామంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.  ఆదివారం బీజేపీ నాయకురాలి ఇంట్లోకి దుండగులు చొరబడి లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పారు. అడ్డొచ్చిన బాధితురాలి భర్తను చితకబాది, వారి 13 ఏళ్ల కుమార్తెను దూషించినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం వారి ఇంట్లో బంగారు, నగదు దోచుకుని పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement