బిల్గేట్స్ భాగస్వామ్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు | Bill gates met central minister venkaiah naidu | Sakshi
Sakshi News home page

బిల్గేట్స్ భాగస్వామ్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు

Sep 19 2014 2:04 PM | Updated on Sep 2 2017 1:39 PM

బిల్గేట్స్ భాగస్వామ్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు

బిల్గేట్స్ భాగస్వామ్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో మైక్రోసాప్ట్ అధినేత బిల్గేట్స్ శుక్రవారం సమావేశం అయ్యారు. క్లీన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా ....

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో మైక్రోసాప్ట్ అధినేత బిల్గేట్స్ శుక్రవారం సమావేశం అయ్యారు. క్లీన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా దేశంలో చేపట్టబోయే పారిశుద్ధ్య ప్రాజెక్టులపై  ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బిల్గేట్స్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో బిల్గేట్స్ భాగస్వామ్యంలో పాలుపంచుకుంటామన్నారు. పారిశుద్ద్యంపై అవగాహన పెంచేందుకు చర్యలు చేపడతామని వెంకయ్య నాయుడు తెలిపారు. మంత్రిత్వ శాఖలో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని బిల్గేట్స్ తెలిపారు. అంతకు ముందు బిల్గేట్స్, ఆయన సతీమణి మిలిండా గేట్.... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement