పశ్చిమబెంగాల్‌లో ఘోరం జరిగింది. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న యువకులను అడ్డుకున్నందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఘోరం జరిగింది. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న యువకులను అడ్డుకున్నందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. మృతుడ్ని పరగాణ జిల్లాకు చెందిన ఎండీ ముస్తాకిన్‌గా గుర్తించారు.
శనివారం శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళా కళాకారులు పాల్గొన్నారు. నలుగురు యువకులు వీరిపట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారు. వీరిని ముస్తాకిన్ అడ్డుకోగా.. నలుగురు యువకులు అతన్ని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, మృతుడు ముస్తాకిన్‌పై క్రిమినల్ రికార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు.