బార్లు తెరుచుకోవడానికి అనుమతులు

Bars To Open In Rajasthan From Today - Sakshi

జైపూర్‌: కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలు అమలైన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపు ఇవ్వడంతో సోమవారం రోజున రాజస్థాన్‌ ప్రభుత్వం బార్లు తిరిగి తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. జూన్‌ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమైనప్పటికీ.. బార్లపై ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఇప్పటివరకు మూసేఉన్నాయి. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్‌లు తెరుచుకోనున్నాయి. 

సామాజిక దూరం పాటిచండం, శానిటైజేషన్‌ ప్రక్రియ చేపట్టడం వంటి నిబంధనలతో బార్లకు అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల దాకా కర్ఫ్యూ యధావిధిగా అమలు కానుండటంతో.. ఉన్న తక్కువ సమయంలోనే తగినంత ఆదాయాన్ని పొందడానికి యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా.. మాల్స్‌, రెస్టారెంట్లు మొదలైన వాటికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కరోనా వైరస్‌ ప్రమాదం దృష్ట్యా ప్రజలు బయటకు రావడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం. చదవండి: మద్యం హోం డెలివరీకి గ్రీన్‌సిగ్నల్‌‌..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top