చావుతప్పి మంత్రి కన్ను లొట్టపోయేదే.. | Baidyanath Sahni had to face protests from Samastipur villagers | Sakshi
Sakshi News home page

చావుతప్పి మంత్రి కన్ను లొట్టపోయేదే..

Jul 31 2014 2:45 PM | Updated on Sep 3 2019 9:06 PM

చావుతప్పి మంత్రి కన్ను లొట్టపోయేదే.. - Sakshi

చావుతప్పి మంత్రి కన్ను లొట్టపోయేదే..

రాజకీయ నాయకులకు ప్రజల మద్దతే కొండంత అండ. అదే ప్రజలు ఎదుతిరిగితే ఎలా ఉంటుందో బీహార్ లోని పశుసంవర్ధక శాఖామంత్రి బైద్యనాథ్ సాహ్ని అడిగితే సరిగ్గా తెలుస్తుంది.

సమస్తిపూర్: రాజకీయ నాయకులకు ప్రజల మద్దతే కొండంత అండ. అదే ప్రజలు ఎదుతిరిగితే ఎలా ఉంటుందో బీహార్ లోని పశుసంవర్ధక శాఖామంత్రి బైద్యనాథ్ సాహ్ని అడిగితే సరిగ్గా తెలుస్తుంది. 
 
బీహార్ లోని సమస్తిపూర్ లోని నికాశ్ పూర్ లో ఓ పెట్రోల్ పంప్ ఆరంభించడానికి ఓ శిలాఫలకం వేయడానికి వెళ్లిన బైద్యనాథ్ కు ఊహించని రీతిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. 
 
కాలేజీకి సంబంధించిన భూమిలో పెట్రోల్ పంప్ ను ఏర్పాటు వ్యతిరేకిస్తున్న మంత్రిపై ప్రజలు కర్రలు, ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. కాలేజి క్యాంపస్ లో ఉన్న కొన్ని ట్రాక్టర్లను గ్రామస్థులు తగలపెట్టారు. ప్రజల దాడి నుంచి తప్పించుకోవడానికి కళాశాలలోని ఓ గదిలోకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ దాచుకున్నారు. 
 
ఆతర్వాత జిల్లా ఎస్పీ, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడంతో అక్కడ నుంచి జారుకున్నారు. ఇదంతా బీజేపీ, అసాంఘీక శక్తుల పనే అని బైద్యనాథ్ ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement