రామ మందిర నిర్మాణానికి భారీగా రాళ్లు | ayodhya: Stones brought for construction of Ram Mandir | Sakshi
Sakshi News home page

రామ మందిర నిర్మాణానికి భారీగా రాళ్లు

Jul 6 2017 11:02 AM | Updated on Apr 6 2019 9:31 PM

రామ మందిర నిర్మాణానికి భారీగా రాళ్లు - Sakshi

రామ మందిర నిర్మాణానికి భారీగా రాళ్లు

ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి మూడు ట్రక్కుల ద్వారా ఎర్రరాళ్లు చేరాయి.

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి మూడు ట్రక్కుల ద్వారా ఎర్రరాళ్లు చేరాయి. రామ మందిరం నిర్మాణం కోసం రాజ‌స్థాన్‌కు చెందిన భ‌ర‌త్‌పూర్ సంస్థ ఈ రాళ్లను పంపించినట్లు రామ జన్మభూమి వీహెచ్‌పీ ప్రతినిధి ప్రకాశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. రామ్‌సేవ‌క్‌ పుర‌మ్ వీహెచ్‌పీ వ‌ర్క్‌పాష్‌ సమీపంలోని రామ్ జ‌న్మ‌భూమి న్యాస్ ప్రాంతంలో క్రేన్స్‌ ద్వారా ఈ రాళ్ల‌ను దించారు. కాగా రామమందిర నిర్మాణం కోసం కావాల్సిన రాళ్ల‌ను ఇక్కడే చెక్కుతున్నారు.

అయితే అప్పటి అఖిలేష్‌ యాదవ్‌  ప్రభుత్వం ఇటుకల తరలింపుపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ అటువంటి ఆంక్షలు విధిస్తుందని తాము అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా  విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) మందిర నిర్మాణానికి ఇటుకలను సేకరించి పంపాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీద్‌ కూల్చివేత కేసులో నిందితుడిగా ఉన్న మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌...రామ్‌ జన్మభూమి న్యాస్‌కు నేతృత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement