బహుభార్యత్వం కన్నా.. అయోధ్యకే ప్రాధాన్యం | Ayodhya Case More Important Than Polygamy | Sakshi
Sakshi News home page

విస్తృత ధర్మాసనానికి నివేదించండి

Apr 6 2018 9:45 PM | Updated on Sep 2 2018 5:18 PM

Ayodhya Case More Important Than Polygamy  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య వివాదం కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించాలంటూ సున్నీ వక్ఫ్‌ బోర్డు, ఇతర ముస్లిం పిటిషనర్లు సుప్రీంకోర్టుకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ముస్లింల బహుభార్యత్వం వివాదం కంటే ఇది చాలా ముఖ్యమైన కేసని ముస్లింల తరఫు న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ కోర్టుకు నివేదించారు. ఈ వివాదానికి సంబంధించిన అన్ని పిటిషన్లను పరిశీలించిన తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

సున్నీ వక్ఫ్‌బోర్డు, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సహా కక్షిదారుల వాదనలు విన్న అనంతరం కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలా ? వద్దా ? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపింది. అలహాబాదాద్‌ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మొత్తం 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అలహాబాద్‌ హైకోర్టు బెంచ్‌ గతంలో 2:1 మెజారిటీతో తీర్పునిస్తూ... సదరు భూమిని సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌లీలా సమానంగా పంచుకోవాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement