బడా కార్ల దొంగ బుక్కయ్యాడు | Auto theft kingpin wanted across India arrested | Sakshi
Sakshi News home page

బడా కార్ల దొంగ బుక్కయ్యాడు

Apr 3 2015 2:19 PM | Updated on Mar 9 2019 4:28 PM

కార్లకు అతడంటే హడల్.. అదేంటని అనుకుంటున్నారా.. ఒంటరిగా కారు కనిపించిందో చిటుక్కున అతడు మాయం చేస్తాడు.

గువాహటి: కార్లకు అతడంటే హడల్.. అదేంటని అనుకుంటున్నారా.. ఒంటరిగా కారు కనిపించిందో చిటుక్కున అతడు మాయం చేస్తాడు. అదేదో అతడు ఉండే చోట కాదు.. మొత్తం దేశ వ్యాప్తంగా ఇదే తంతు. బిజినెస్మెన్ చిత్రంలో సూర్యభాయ్ (మహేశ్బాబు)  నెట్ వర్క్ మాదిరిగా ఈ కార్ల దొంగకు దేశమంతటా పెద్ద నెట్వర్క్ ఉంది. ఇప్పుడా కార్ల గజదొంగ పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే... దేశ వ్యాప్తంగా పలు కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న అనిల్ చవాన్ను గువాహటి పోలీసులు శుక్రవారం అజారాలో అరెస్టు చేశారు. అతడి కీలక అనుచరుడు మమూద్ చౌదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఆ వెంటనే, అతడి కోసం తీవ్రంగా గాలింపులు జరుపుతున్న ముంబయి, న్యూఢిల్లీ, మేఘాలయ పోలీసులకు సమాచారం అందించారు. అరెస్టుతోపాటు అనిల్ చవాన్ నుంచి తుపాకీ, ఐదు రౌండ్ల బుల్లెట్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఆటోమోబైల్ దొంగతనాలు, ముఖ్యంగా కార్ల దొంగతనాల్లో అనిల్ది అందె వేసిన చేయి అని, దేశవ్యాప్తంగా అతడు చాలా ప్రభావం కలిగినవాడని తెలిపారు.  ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement