రూ.4,700 కోట్ల స్టెర్లింగ్‌ ఆస్తుల అటాచ్‌ | Sakshi
Sakshi News home page

రూ.4,700 కోట్ల స్టెర్లింగ్‌ ఆస్తుల అటాచ్‌

Published Sat, Jun 2 2018 4:14 AM

Attach a total of Rs 4,700 crore sterling assets - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులను రూ.5,000 కోట్ల మేరకు మోసగించిన కేసుకు సంబంధించి గుజరాత్‌ ఫార్మా కంపెనీ స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్‌నకు చెందిన రూ.4,700 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శుక్రవారం అటాచ్‌ చేసింది. ఈ సంస్థ, దాని ప్రమోటర్లు నితిన్, చేతన్‌ సందేశారాలపై గత ఏడాది అక్టోబర్‌లో కేసు నమోదు చేసింది.

సందేశారా సోదరులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి వివిధ బ్యాంకుల నుండి సుమారు రూ.5,000 కోట్ల రుణాలను పొందారు.  4,000 ఎకరాల స్థలం, ఫ్యాక్టరీ, యంత్రాలు, కంపెనీలు, నిర్వాహకులకు చెందిన 200 బ్యాంక్‌ ఖాతాలను, రూ.6.67 కోట్ల విలువైన వాటాలను, లగ్జరీ కార్లు వంటి పలు స్థిర, చరాస్తులను అటాచ్‌ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. స్టెర్లింగ్‌ గ్రూపు చేసిన పలు విదేశీ లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నామని, 50 విదేశీ బ్యాంకు ఖాతాలు, నైజీరియాలోని ఆయిల్‌ రిగ్స్, ఆయిల్‌ ఫీల్డ్స్‌లను సీజ్‌ చేసేందుకు విదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

Advertisement
Advertisement