కరోనాపై పోరు: వారికి రూ. కోటి పరిహారం | Arvind Kejriwal Says Rs Crore For Families Of COVID-19 Warriors If They Die | Sakshi
Sakshi News home page

కోవిడ్‌తో పోరాడే వైద్య సిబ్బందికి భారీ ఆసరా

Apr 1 2020 3:11 PM | Updated on Apr 1 2020 3:31 PM

Arvind Kejriwal Says Rs Crore For Families Of COVID-19 Warriors If They Die   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో పాజిటివ్‌ రోగులకు సేవలు అందిస్తూ వైద్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందచేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం వెల్లడించారు. కరోనా కేసులను పరిశీలించే వైద్య సిబ్బంది సైనికులకు ఏమాత్రం తక్కువకాదని ఆయన కొనియాడారు.

కరోనా రోగులకు సేవలందిస్తూ డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి సేవలకు గౌరవసూచకంగా ఆయా కుటుంబాలకు రూ. కోటి అందచేస్తామని చెప్పారు. వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన వారైనా పరిహారం వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

చదవండి: వ‌ల‌స కార్మికుల‌కు కేజ్రీవాల్ మ‌రోసారి విజ్ఞ‌ప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement