కేజ్రీవాల్కు దక్కని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ | Arvind Kejriwal fails to get appointment with Narendra Modi | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్కు దక్కని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్

Mar 7 2014 3:12 PM | Updated on Aug 15 2018 2:14 PM

కేజ్రీవాల్కు దక్కని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ - Sakshi

కేజ్రీవాల్కు దక్కని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విమర్శల వర్షం కురిపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. నాటకీయ రీతిలో శుక్రవారం మోడీతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించారు.

గాంధీనగర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విమర్శల వర్షం కురిపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. నాటకీయ రీతిలో శుక్రవారం మోడీతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించారు. గుజరాత్లో అభివృద్ధి, గ్యాస్ ధరలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆయనకు మోడీ అపాయింట్మెంట్ లభించలేదు.

గుజరాత్ అభివృద్ధిని పరిశీలించేందుకు పార్టీ నేత మనీష్ సిసోడియా కలసి రెండ్రోజులుగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం గాంధీనగర్ వెళ్లారు. కాగా మోడీ అధికార నివాసానికి ఐదు కిలో మీటర్ల దూరంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సిసోడియా మోడీ నివాసానికి వెళ్లి అపాయింట్మెంట్ కావాలని ఆయన వ్యక్తిగత కార్యదర్శిని కోరారు. ఈ విషయంలో మోడీ నిర్ణయం తీసుకుంటారని, త్వరలో సమాచారం తెలుపుతామని చెప్పారని సిసోడియా ట్వీట్ చేశారు. మోడీ రిలయన్స్ సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అంబానీల జేబులో బొమ్మంటూ కేజ్రీవాల్ తరచూ విమర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement