'మోదీది రాజకీయ కక్ష' | Arvind Kejriwal backs Mamata, attacks PM Modi | Sakshi
Sakshi News home page

'మోదీది రాజకీయ కక్ష'

Jan 4 2017 2:36 PM | Updated on Aug 15 2018 6:34 PM

'మోదీది రాజకీయ కక్ష' - Sakshi

'మోదీది రాజకీయ కక్ష'

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అండగా నిలిచారు.

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అండగా నిలిచారు. రోజ్‌ వ్యాలీ చిట్‌ ఫండ్‌ స్కాంలో టీఎంసీ నేత సుదీప్‌ బందోపాధ్యాయ్‌ అరెస్టు బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలని మండిపడ్డారు. బుధవారం ఆయన ఈ మేరకు ట్విట్టర్‌లో బీజేపీపై దాడి చేశారు.

'ఇది మోదీ కక్ష సాధింపు రాజకీయం. ఆయన ప్రవేశ పెట్టిన పెద్ద నోట్ల రద్దును ఎవరు వ్యతిరేకించినా ఆయన భరించలేరు' ఆయన ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వడంతోపాటు ఆ పార్టీతో కలిసిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement