గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు.
గోవా సీఎంపై ఢిల్లీ సీఎం విమర్శలు
Jun 29 2016 5:56 PM | Updated on Sep 4 2017 3:43 AM
పనాజి: గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అవినీతి కేసులో పట్టుపడ్డ ఆయన బంధువును తిరిగి ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకోవడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుపట్టారు. దీనితో ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇదే స్థానంలో తన బందువు ఉంటే ఈ పాటికి జైలులో ఉండేవాడని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. గోవాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన కోలంగేట్ లోని హోటల్ ప్రతినిథులలో మాట్లాడుతూ ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. గోవా సీఎంకు బావ అయిన దిలిప్ మాలవంకర్ ఆ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో పని చేస్తున్నారు. గతేడాది ఆయన రూ. లక్ష లంచం తీసుకుంటూ తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ కేసులో సస్పెండ్ అయ్యారు.
Advertisement
Advertisement