‘శబరిమలను థాయ్‌లాండ్‌గా మార్చొద్దు’

Are You Trying to Make Sabarimala as Like Thailand, Temple Chief Questions Critics

చెన్నై : ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలను థాయ్‌లాండ్‌ కానివ్వమని ట్రావెన్‌కోర్‌ దేవస్థాన బోర్డు చీఫ్‌ ప్రయార్‌ గోపాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా సంప్రదాయ కుటుంబాల్లో జన్మించిన మహిళలు స్వతంత్రంగా ఆలయంలోకి ప్రవేశించకుండా ఉండాలని అన్నారు.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ గళమెత్తిన విమర్శకులపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. శబరిమలను థాయ్‌లాండ్‌ మార్చొద్దని వ్యాఖ్యానించారు. సవాళ్లతో కూడుకున్న నడకదారిలో 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలను వెళ్లడానికి అనుమతిస్తే.. భద్రత సంగతేమిటని ప్రశ్నించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top