పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్షం భేటీ | All party meet underway ahead of first budget session | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్షం భేటీ

Jul 7 2014 10:44 AM | Updated on Aug 15 2018 2:20 PM

పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా సోమవారం అఖిల పక్షం సమావేశమైంది.

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి  ప్రారంభం కానున్న సందర్భంగా సోమవారం అఖిల పక్షం సమావేశమైంది. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని ఈ సందర్భంగా అన్ని పార్టీలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరయ్యారు.  కాగా పోలవరం ప్రాజెక్ట్, గవర్నర్కు ప్రత్యేక అధికారాలపై నిరసన తెలుపుతూ టీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వగా, ప్రశ్నోత్తరాలు రద్దు చేసి ఉమ్మడి రాజధానిలో స్థానికేతరుల సమస్యలపై టీడీపీ లోక్సభలో వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

కాగా పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే, సాధారణ బడ్జెట్‌ను సభకు సమర్పించనుంది. ఇప్పటికే రైల్వే చార్జీలు పెంచిన మోడీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలు ఇస్తుండటంతో.. బడ్జెట్ వాతలు ఏ మేరకు ఉంటాయోనని అన్ని వర్గాల ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement