వాయు కాలుష్యంతో ఒబేసిటీ  | Air Pollution Might Be Linked To Obesity | Sakshi
Sakshi News home page

Nov 12 2018 10:20 PM | Updated on Nov 12 2018 10:20 PM

Air Pollution Might Be Linked To Obesity - Sakshi

న్యూఢిల్లీ: కాలుష్యం... కాలుష్యం... ఇప్పుడు ఏ వార్తాపత్రిక చదివినా, ఏ న్యూస్‌ చానల్‌ పెట్టినా ఇదే వార్త. వాయుకాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పటి వరకు కాలుష్యానికి ప్రభావితమవుతున్న వారు ఊపిరిత్తుల, శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని మాత్రమే తెలుసు. కాగా తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో... వాయు కాలుష్యం వల్ల బరువు కూడా పెరుగుతున్నట్లు  తేలింది. గాలిలోని టాక్సిన్ల వల్ల ఊబకాయం బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పది సంవత్సరాల వయసు ఉన్న చిన్నారుల్లో వాయు కాలుష్యానికి ప్రభావితమైన వారు, మంచి గాలి పీల్చుకుంటున్న వారికంటే ఎక్కువ బరువుతో ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. కలుషిత గాలి పీల్చుకోవడం వల్లే వీరు బరువు పెరుగుతున్నారని తేల్చి చెబుతున్నారు. ఇలా జరగడానికి గల కారణాన్ని పరిశోధకులు వివరిస్తూ... ‘కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి సంచులపై ప్రతికూల ప్రభావం చూపడం వల్ల కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. దీంతో తీసుకున్న ఆహారంలోని శక్తిని గ్రహించే స్థాయి తగ్గుతుంది, అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. ఈ అస్థిరతల వల్ల ఆకలిలో హెచ్చుతగ్గులు రావడంతో తమకు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. ఈ కారణంగానే ప్రజలు బరువు పెరుగుతున్నార’ని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement