'మహా' అసెంబ్లీని కుదిపేసిన అసద్ కామెంట్స్ | AIMIM leader Waris Pathan suspended from Maharashtra Assembly | Sakshi
Sakshi News home page

'మహా' అసెంబ్లీని కుదిపేసిన అసద్ కామెంట్స్

Mar 16 2016 5:40 PM | Updated on Aug 17 2018 6:12 PM

'మహా' అసెంబ్లీని కుదిపేసిన అసద్ కామెంట్స్ - Sakshi

'మహా' అసెంబ్లీని కుదిపేసిన అసద్ కామెంట్స్

అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర శాసనసభ బుధవారం అట్టుడికింది.

ముంబై/హైదరాబాద్: 'గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతాకి జై అనను' అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర శాసనసభ బుధవారం అట్టుడికింది. అసద్ వ్యాఖ్యలను ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ సమర్ధించారు. సభలో 'భారత్ మాతాకి జై' అని నినదించేందుకు పఠాన్ నిరాకరించడంతో ఆయనను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెన్షన్ విధించారు.

మరోవైపు అసదుద్దీన్ ఒవైసీపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్ మల్కాజ్ గిరి కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు 153 ఏ కింద కేసు నమోదు చేయాలని నెరేడ్ మెట్ పోలీసులను ఆదేశించింది.  అసదుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులోనూ మంగళవారం పిల్ దాఖలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement