‘మోదీ ఫొటోను చెప్పులతో కొట్టండి’ | abdulajalil Mustan Commented over modi | Sakshi
Sakshi News home page

‘మోదీ ఫొటోను చెప్పులతో కొట్టండి’

Mar 1 2017 2:26 AM | Updated on Aug 21 2018 9:33 PM

నోట్ల రద్దుకు నిరసనగా జరిగిన సభలో ప్రధాని మోదీని ఫొటోను చెప్పులతో కొట్టాలని బిహార్‌ ఎక్సైజ్‌ మంత్రి అబ్దులజలీల్‌ మస్తాన్ ప్రజలకు వివాదాస్పద విజ్ఞప్తి చేశారు.

పట్నా: నోట్ల రద్దుకు నిరసనగా జరిగిన సభలో ప్రధాని మోదీని ఫొటోను చెప్పులతో కొట్టాలని బిహార్‌ ఎక్సైజ్‌ మంత్రి అబ్దులజలీల్‌ మస్తాన్   ప్రజలకు వివాదాస్పద విజ్ఞప్తి చేశారు. దీంతో కొందరు వేదికపై కుర్చీలోని మోదీ ఫొటోపై చెప్పులు విసిరారు.

ఈ నెల 22న మంత్రి నియోజకవర్గమైన పూర్ణియా జిల్లా అమోర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు మంగళవారం స్థానిక చానళ్లలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను 50 రోజుల్లో పరిష్కరిస్తానని, అలా చేయకపోతే శిక్ష ఎదుర్కొంటానని ప్రధానే స్వయంగా చెప్పారని మస్తాన్  అన్నట్లు వీడియోలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement