రాహుల్ తప్పిపోయారండో.. గుర్తిస్తే రివార్డు | A Reward for Finding 'Missing' Rahul Gandhi, Say Posters in UP | Sakshi
Sakshi News home page

రాహుల్ తప్పిపోయారండో.. గుర్తిస్తే రివార్డు

Mar 25 2015 9:52 AM | Updated on Sep 2 2017 11:22 PM

రాహుల్ తప్పిపోయారండో.. గుర్తిస్తే రివార్డు

రాహుల్ తప్పిపోయారండో.. గుర్తిస్తే రివార్డు

లక్నో: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పిపోయాడంటూ ఉత్తరప్రదేశ్లో పలు పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. రాహుల్ తప్పిపోయారు.. గుర్తించినవారికి రివార్డులు కూడా ఇస్తాం అంటూ వాటిల్లో ప్రకటించారు.

లక్నో: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పిపోయాడంటూ ఉత్తరప్రదేశ్లో పలు పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. రాహుల్ తప్పిపోయారు.. గుర్తించినవారికి రివార్డులు కూడా ఇస్తాం అంటూ వాటిల్లో ప్రకటించారు. ఆయన సొంత నియోజకవర్గం ఆమేథిలో కూడా ఇవి కనిపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత నెల రోజులుగా రాహుల్గాంధీ సెలవుల పేరిట వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.

ఈ నేపథ్యంలోనే పలు విమర్శలు తలెత్తాయి. ఆమేథిలో అయితే తమ భావాలను ఏకంగా ఓ పాట రూపంలో 'జానే వో కౌన్సా దేశ్, జానే తుమ్ చలే గయే' (నువ్వెక్కడికి వెళ్లావో ఎవరికీ తెలుసు) అంటూ ప్రకటించారు. దీంతోపాటు తమ ప్రాంతాల్లోని పాడపోయిన రోడ్లనుగురించి, మంచినీటి సమస్య గురించి ఇలా పలు సమస్యలు జాబితా రూపాల్లో ప్లెక్సీల్లో పొందుపరిచారు. ఆయనతోపాటు బీజేపీ కేంద్ర మంత్రి ఉమా భారతి కూడా తప్పిపోయారంటూ వీరిద్దరు పలు వాగ్దానాలు చేసి వాటిని అమలుచేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement