వీసాకెళ్తే.. నా భార్యను నిర్బంధించారు | A Pakistani teenager complained on Indian High Commission | Sakshi
Sakshi News home page

వీసాకెళ్తే.. నా భార్యను నిర్బంధించారు

May 8 2017 1:00 AM | Updated on Sep 5 2017 10:38 AM

వీసా కోసం భారతహైకమిషన్‌కు వెళ్లిన తన భార్యను నిర్బంధించారని ఓ పాక్‌ యువకుడు ఫిర్యాదు చేశాడు.

ఇస్లామాబాద్‌: వీసా కోసం భారతహైకమిషన్‌కు వెళ్లిన తన భార్యను నిర్బంధించారని ఓ పాక్‌ యువకుడు ఫిర్యాదు చేశాడు. పాక్‌కు చెందిన తాహిర్‌ ఢిల్లీ యువతి ఉజ్మాను మే 3న వివాహం చేసుకున్నాడు. వీసా వివరాలు ఇచ్చేందుకు తన భార్యతో కలసి కమిషన్‌కు వెళ్లాడు. అయితే కార్యాలయం లోపలికి వెళ్లిన తన భార్య చాలా సేపటివరకు బయటకు రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన తాహిర్‌ అధికారులను సంప్రదించాడు.

ఉజ్మా ఆఫీస్‌లో లేదని వారు సమాధానమిచ్చారు. తన మొబైల్‌ ఫోన్లు కూడా కమిషన్‌ వద్దే ఉన్నాయని తాహిర్‌ గుర్తించాడు. దీంతో కమిషన్‌పై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. కాగా, ఉజ్మా కమిషన్‌లో ఒంటరిగా ఉందని పాక్‌ పత్రిక వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement