స్విట్జర్లాండ్‌లో అశోక్ సెల్వన్‌తో.. | A big challenge ahead for Bindu Madhavi and Ashok Selvan? | Sakshi
Sakshi News home page

స్విట్జర్లాండ్‌లో అశోక్ సెల్వన్‌తో..

Oct 25 2014 11:58 PM | Updated on Sep 2 2017 3:22 PM

స్విట్జర్లాండ్‌లో అశోక్ సెల్వన్‌తో..

స్విట్జర్లాండ్‌లో అశోక్ సెల్వన్‌తో..

నగర వాతావరణంలో పుట్టి పెరిగిన నటి బిందుమాధవి. అయితే ఈ అచ్చ తెలుగు అమ్మాయికి కోలీవుడ్‌లో ఎక్కువగా పల్లెపడుచు పాత్రలే వరించడం విశేషం. ఇటీవల నటిగా కాస్త వెనుకబడిన

నగర వాతావరణంలో పుట్టి పెరిగిన నటి బిందుమాధవి. అయితే ఈ అచ్చ తెలుగు అమ్మాయికి కోలీవుడ్‌లో ఎక్కువగా పల్లెపడుచు పాత్రలే వరించడం విశేషం. ఇటీవల నటిగా కాస్త వెనుకబడిన బిందుకు తాజాగా ఒక చిత్రం వచ్చింది. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ ఏకంగా స్విట్జర్లాండ్ చుట్టి రానుండడం విశేషం. బిందుమాధవి నటిస్తున్న తాజా చిత్రం సవాలే సమాలి. ఇప్పటి వరకు పోషించని సరికొత్త పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారట ఈ అమ్మడు.
 
 కోలీవుడ్‌లో అధికంగా గ్రామీణ పాత్రలే పోషించిన బిందుమాధవి ఈ చిత్రంలో చాలా మోడ్రన్ పాత్రను ధరిస్తున్నారట. దీని గురించి ఈ జాణ మాట్లాడుతూ సవాలే సమాలి చిత్రం తన గత ఇమేజ్‌ను పూర్తిగా మార్చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలోని పాత్ర తనకు చాలా రిలీఫ్ నిస్తుందనే చెప్పాలన్నారు. హోమ్లీ ఇమేజ్‌ను కూడా ఈ పాత్ర బ్రేక్ చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ చిత్రం కోసం తొలిసారిగా స్విట్జర్లాండ్ చుట్టొస్తున్నట్లు పేర్కొన్నారు. హీరో అశోక్ సెల్వన్‌తో కలసి అక్కడ ఒక డ్యూయెట్ పాడుకున్నట్లు తెలిపారు. సవాలే సమాలి వైవిధ్య భరిత కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం అని చెప్పారు.
 
 తనకు అశోక్ సెల్వన్‌కు మధ్య లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నారు. మరో విషయం ఏమిటంటే త్వరలో మరోసారి పాండిరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు చాలా ఎగ్జైటింగ్‌తో చెప్పారు. ఈ చిత్రం గురించిన విషయాలను తానిప్పుడు చెప్పలేనన్నారు.  ప్రస్తుతం పాండిరాజ్ శింబు, నయనతార జంటగా నటిస్తున్న ఇది నమ్మ ఆళు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement