మయన్మార్ లో భూకంపం! | 6.8 quake hits Myanmar: IMD | Sakshi
Sakshi News home page

మయన్మార్ లో భూకంపం!

Apr 13 2016 8:41 PM | Updated on Sep 3 2017 9:51 PM

భారత్ మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా బంగ్లాదేశ్ లోనూ, ఈశాన్య భారతదేశంలోనూ అక్కడక్కడా ప్రకంపనలు సంభవించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

న్యూ ఢిల్లీః భారత్ మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. భారత సరిహద్దు ప్రాంతంలోని వాయువ్య మయన్మార్ ను తాకిన శక్తివంతమైన భూకంపం కారణంగా బంగ్లాదేశ్ లోనూ, ఈశాన్య భారతదేశంలోనూ అక్కడక్కడా ప్రకంపనలు సంభవించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

భూకంపం వల్ల వచ్చిన ప్రకంపనలకు జనం భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ళనుంచి బయటకు పరుగులు తీశారు. మాల్విక్ కేంద్రానికి 74 కిలోమీటర్ల ఆగ్నేయంగా రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.8 గా నమోదైనట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే సంస్థ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement