బస్సు బోల్తా : 30 మంది భక్తులకు గాయాలు | 30 pilgrims injured as bus overturns | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా : 30 మంది భక్తులకు గాయాలు

Feb 10 2016 4:19 PM | Updated on Sep 3 2017 5:22 PM

అజ్మీర్ దర్గాను సందర్శించేందుకు భక్తులతో వెళ్తున్న బస్సు బుధవారం ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిపై బోల్తా పడింది.

జైపూర్: అజ్మీర్ దర్గాను సందర్శించేందుకు భక్తులతో వెళ్తున్న బస్సు బుధవారం ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది భక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సమీపంలోని రెండు ఆసుపత్రుల్లో తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

బిహార్ రాష్ట్రానికి చెందిన వీరంతా ఖాజా మొయినొద్దీన్ చిస్తీలో ప్రత్యేక ప్రార్థనల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా గాయపడ్డాడని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement