breaking news
Pilgrims Injured
-
బస్సు బోల్తా : 30 మంది భక్తులకు గాయాలు
జైపూర్: అజ్మీర్ దర్గాను సందర్శించేందుకు భక్తులతో వెళ్తున్న బస్సు బుధవారం ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది భక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సమీపంలోని రెండు ఆసుపత్రుల్లో తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. బిహార్ రాష్ట్రానికి చెందిన వీరంతా ఖాజా మొయినొద్దీన్ చిస్తీలో ప్రత్యేక ప్రార్థనల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా గాయపడ్డాడని తెలిపారు. -
ఘాట్రోడ్డులో ప్రమాదం: భక్తులకు గాయాలు
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 16వ మలుపు వద్ద గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వేగంగా వెళ్తున్న వాహనం ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తీసి... ట్రాఫిక్ని పునరుద్ధరించారు.