
బలరాంపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా డివిజన్ అడవిలో గురువారం మరో ఏనుగు విగత జీవిగా మారింది. మంగళ, బుధవారాల్లో రెండు ఏనుగులు మరణించాయి. వీటిలో ఒకటి గర్భంతో ఉంది. ఈ రెండూ సూరజ్ పూర్ జిల్లాలోని ప్రతాప్‌పూర్ ఫారెస్ట్ రేంజ్‌లో కనిపించాయి. మరణించిన మూడూ ఆడ ఏనుగులే కావడం గమనార్హం. అన్నింటి మరణం ఒకేలా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే అది సాధారణం కాదని, విషం వల్ల మరణించి ఉండవచ్చని చెబుతున్నారు. మహువా పూలను అధికంగా తినడంగానీ లేదా యూరియా మందును తిని ఉండవచ్చని భావిస్తున్నారు. ఏనుగుల మీద ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. విషప్రయోగం జరిగిందేమో తెలుసుకోవ డానికి అడవిలోని నీటిని పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
గజరాజుకు పరీక్ష
రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఏనుగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం