కశ్మీర్లో గంజాయి విక్రయం: ముగ్గురి అరెస్ట్ | 3 drug peddlers arrested in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్లో గంజాయి విక్రయం: ముగ్గురి అరెస్ట్

Apr 30 2016 6:46 PM | Updated on May 25 2018 2:37 PM

మారకద్రవ్యాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు.

శ్రీనగర్: మారకద్రవ్యాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఒక ప్రైవేట్ వాహనంలో శనివారం మత్తుమందును అమ్ముతుండగా వారు పోలీసులకు కంటబడ్డారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని అడ్డగించి ముగ్గురి వ్యక్తులను అరెస్ట్ చేశారు.

అంతేకాకుండా ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఒక కేజీ వరకూ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారు.. ఆదిల్ వానీ, మెహమ్మద్ దిల్వార్, ఉబయిద్ భట్గా గుర్తించారు. నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement