ఆమె త్యాగం బీజేపీని కాపాడలేదు: రాహుల్ | 13 years of Modi rule responsible for Gujarat burning: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఆమె త్యాగం బీజేపీని కాపాడలేదు: రాహుల్

Aug 2 2016 10:51 AM | Updated on Sep 4 2017 7:30 AM

ఆమె త్యాగం బీజేపీని కాపాడలేదు: రాహుల్

ఆమె త్యాగం బీజేపీని కాపాడలేదు: రాహుల్

బలిపశువు త్యాగం బీజేపీని కాపాడలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్య చేశారు.

న్యూఢిల్లీ: గుజరాత్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు నరేంద్ర మోదీ 13 ఏళ్ల పాలన కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బలిపశువు త్యాగం బీజేపీని కాపాడలేదని ఘాటు వ్యాఖ్య చేశారు. 'గుజరాత్ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు 2 ఏళ్ల ఆనందీబెన్ పాలన కారణం కాదు. 13 ఏళ్ల మోదీ పాలనే కారణమ'ని  రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధినాయకత్వాన్ని ఆనందీబెన్ పటేల్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఈ పరిణామంపై స్పందించారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆనందదీబెన్ రాజీనామాకు సిద్ధపడ్డారని శంకర్‌సిన్హ్ వాఘేలా అన్నారు. 2017లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీకి ఓటమి తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయని సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement