క్రిమినల్‌ లావాదేవీలుగా చూపారు | ‘Bank giving colour of criminality to usual bank transactions | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌ లావాదేవీలుగా చూపారు

Jan 6 2019 5:13 AM | Updated on Jan 6 2019 5:13 AM

‘Bank giving colour of criminality to usual bank transactions - Sakshi

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో తాను భారత్‌కు తిరిగిరాలేనని నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ తెలిపారు. భారత్‌లో తన ప్రాణాలకు భద్రత లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.నీరవ్‌ మోదీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని ఈడీ ముంబైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన న్యాయవాది న్యాయస్థానంలో ఈ మేరకు స్పందించారు. ఈ వ్యవహారంలో తానే దోషి అన్నట్లు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారని నీరవ్‌ పిటిషన్‌లో తెలిపారు. తాను చేసిన సాధారణ బ్యాంకింగ్‌ వ్యవహారాలను కూడా పీఎన్‌బీ అధికారులు క్రిమినల్‌ లావాదేవీలుగా కలరింగ్‌ ఇచ్చారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement