గొల్లపూడి మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

సాక్షి, అమరావతి : ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వినూత్నమైన డైలాగ్ డెలివరీతోపాటు, రచనల్లో, నాటకాల్లో తనదైన శైలితో ఆయన అందరిని ఆకట్టుకున్నారని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారని తెలిపారు.
కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. రచయితగా, నటుడుగా, సంపాదకుడిగా, వ్యాఖ్యతగా గొల్లపూడి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
చదవండి : సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి