ప్రేమ లేని ప్రేమ కథ | Youthful entertainer 'Plus One' | Sakshi
Sakshi News home page

ప్రేమ లేని ప్రేమ కథ

Dec 9 2016 11:46 PM | Updated on Sep 4 2017 10:18 PM

ప్రేమ లేని ప్రేమ కథ

ప్రేమ లేని ప్రేమ కథ

రోషన్, ఆర్తి జంటగా తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్లస్‌ వన్‌’.

రోషన్, ఆర్తి జంటగా తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్లస్‌ వన్‌’. అళహరి దర్శకత్వంలో సచేతా డ్రీమ్‌ వర్క్స్‌ పతాకంపై విశ్వాస్‌.హెచ్‌ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి. కల్యాణ్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమలేని ప్రేమ కథ ఒక వైపు.. ప్రేమ ఉన్న ప్రేమ మరోవైపు. ఈ అంశాలను, స్వీట్‌ 16 వయసును దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశాం. తెలియని పొరపాటు వల్ల జరిగిన తప్పుని ఒప్పుగా చేసుకునేందుకు ఓ జంట ఏం చేశారన్నదే కథ’’ అన్నారు. ‘‘నల్గొండలో షూట్‌ మొత్తం పూర్తి చేశాం’’ అని నిర్మాత చెప్పారు. తేజారెడ్డి, పూర్ణిమ, సరయు, ప్రతాని రామకృష్ణగౌడ్‌ తదితరులు నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement