యూత్‌ ఇలా ఉందేంటి రాజా

Yenti Raja Youth Ila Undi Movie Audio Launch - Sakshi

‘పోటుగాడు’ ఫేమ్‌ సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో, పర్వీన్‌ రాజ్, పోసాని కృష్ణ మురళి ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘యేంటి రాజా యూత్‌ ఇలా ఉంది’. ఆది శేషసాయి రెడ్డి దర్శకత్వంలో లార్డ్‌ శివ క్రియేషన్స్‌ పతాకంపై ఎమ్వీఎస్‌ సాయి క్రిష్ణారెడ్డి నిర్మించారు. కిషన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకులు సముద్ర, దేవీప్రసాద్, నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సాక్షీ చౌదరి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు సంపాదన కోసం పరుగులు తీస్తూ పిల్లల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆదరణ కరువైన పిల్లలు ఎలా చెడు దారి పట్టే అవకాశాలు ఉన్నాయో మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇదొక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రం ద్వారా సొసైటీకి మూడు సందేశాలు ఇస్తున్నా. అవేంటి అన్నది తెరపై చూడాలి’’ అన్నారు ఆది శేషసాయి రెడ్డి. ‘‘సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. ఫస్ట్‌ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్ర సమర్పకులు నర్రా సుబ్బయ్య అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top