డిటెక్టివ్ లా వెంటబడనక్కర్లేదు:దియా మీర్జా


ముంబై:గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న సాహిల్ సంగా- దియా మీర్జాలు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ మధ్యనే వారిద్దరూ బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్  ద్వారా  నిర్మించిన 'బాబీ జాసెస్' చిత్రం విజయం సాధించడంతో మళ్లీ వార్తలో నిలిచారు. కొంత సాహిల్ తో  వివాహానికి సంబంధించిన ఊహాగానాలపై దియా తొలిసారి స్పందించింది. ' మా పెళ్లి విషయంలో దాపరికాలు ఏమీ లేవు. మా వివాహం త్వరలోనే జరుగుతుంది. దీనిపై ఎవరూ డిటెక్టివ్ లా వెంటబడనక్కర్లేదు' అంటూ దియా పేర్కొంది. త్వరలో జరిగే తమ వివాహానికి సంబంధించిన వివరాలను ఇప్పుడే  చెబితే ఇక చెప్పడానికి ఏముంటుందని ప్రశ్నించింది.  సాహిల్ తో మ్యారెజ్ కు ఆత్రుతగా ఉన్న దియా.. ఈ సంవత్సరంలోనే తమ పెళ్లి వేడుకలు ఉంటాయని కచ్చితంగా చెబుతోంది. కాకపోతే డిటెక్టివ్ లా ఎవరూ దీనిపై శోధించాల్సిన అవసరం లేదని పేర్కొంది.


 


మా పెళ్ల్లి తప్పకుండా ఇండియాలోనే జరుగుతుందని.. అది కూడా అక్టోబర్ లోనే ఉండవచ్చని స్పష్టం చేసింది.  దానికి సంబంధించి వివరాలను మరోవారంలో వెల్లడిస్తా నంటూ తెలిపింది. గత ఏప్రిల్ లో తన వ్యాపారి భాగస్వామి అయిన సాహిల్ తో దియా  నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. దియామీర్జా, సాహిల్ సంగా కలిసి బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను 2011లో ఏర్పాటుచేశారు. 'లవ్ బ్రేకప్స్ జిందగీ' అనే సినిమాతో నిర్మాణం మొదలుపెట్టి,  తాజాగా విద్యాబాలన్తో 'బాబీ జాసూస్' చిత్రాన్ని తెరకెక్కించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top