బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!? | Wii Bigg Boss 3 Show End On 27th October | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

Oct 26 2019 5:40 PM | Updated on Oct 26 2019 9:08 PM

Wii Bigg Boss 3 Show End On 27th October - Sakshi

కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌3 తుది అంకానికి చేరింది. గత 14 వారాలుగా బుల్లితెరపై సందడి చేస్తూ వచ్చిన ‘బిగ్‌బాస్‌’కి కొద్దిరోజుల్లో ఎండ్‌ కార్డు పడనుంది. 15 మంది కంటెస్టన్స్‌తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది నలుగురు. వారిలో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అయ్యి మిగిలిన ముగ్గురు, ఇప్పటికే ఫైనల్‌కు వెళ్లిన రాహుల్‌, బాబా భాస్కర్‌తో కలిసి ఫైనల్‌లో పోటీ పడతారు. ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఈ రోజు లేదా రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది. ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్‌3 షోకి రేపే ముంగింపు ఉండబోతుందన్న వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్టార్ మా యాజమాన్యం ఎలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ..సోషల్‌ మీడియాలో మాత్రం పెద్ద చర్చ మొదలైంది. అక్టోబర్‌ 28 నుంచి స్టార్‌ మా ఛానల్‌లో కొత్త సీరియల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ షోను రేపటితో ముగిస్తుందని ప్రచారం సాగుతోంది. ఈ ఆదివారమే బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే ఉంటుందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ వారం హౌజ్‌మేట్స్‌కి లగ్జరీ బడ్జెంట్‌ ఇవ్వలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. దీపావళి సందర్భంగా సీజన్‌ 3కి ఎండ్‌ కార్డ్‌ పడిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, లాజికల్‌గా చూస్తే అది సాధ్యకాదని మరి కొంత మంది భావిస్తున్నారు.ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఒక్కరు ఎలిమినేట్‌ అవుతారని, మిగిలిన ఐదుగురిని మరోక వారం ఇంట్లో ఉంచి..ఆ తర్వాత విన్నర్‌ను ప్రకటిస్తారని మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే వారం మాత్రం షో ప్రసార సమయంలో మార్పులు ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు బిగ్‌బాస్‌ ప్రసారం కానున్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో మాత్రం యథాతథంగా 9 గంటలకే ప్రసారమవతుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వచ్చే వారం కూడా బిగ్‌బాస్‌ షో కొనసాగితే.. మూడో సీజన్‌ 105 రోజులు జరినట్లు చరిత్రలో నిలిచిపోతుంది. కాగా, జూ.ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ 70 రోజులు మాత్రమే కొనసాగింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌ 112 రోజులుపాటు కొనసాగి అత్యధిక రోజలు పాటు ప్రసారమైన బిగ్‌బాస్‌ సీజన్‌గా రికార్డు సృష్టించింది.

కాగా నిన్నటి 97వ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ పెద్ద షాకిచ్చాడు. అనూహ్యంగా బాబా భాస్కర్‌ను ఫైనల్స్‌కు పంపిచాడు. దీంతో శ్రీముఖి, అలీ రేజా, వరుణ్, శివజ్యోతి మాత్రమే నామినేషన్‌లో ఉన్నారు. వీరిలోనుంచి ఒకరు ఈ రోజు లేదా రేపు ఎలిమినేట్‌ అవుతారు. అయితే ఎలిమినేట్‌ ఎవరనే ఉత్కంఠకు లీకులు వీరులు తెరదించారు.  ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది శివజ్యోతి అనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఎప్పటి మాదిరిగానే లీకుల వీరులు చెప్పినట్లు శివజ్యోతి ఎలిమినేట్‌ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మరొకొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement