నిశ్చయమైందా? | Whoa! Naga Chaitanya, Samantha to get engaged on January 29, 2017? | Sakshi
Sakshi News home page

నిశ్చయమైందా?

Dec 25 2016 11:14 PM | Updated on Sep 4 2017 11:35 PM

నాగచైతన్య, సమంత

నాగచైతన్య, సమంత

అక్కినేని కుటుంబంలో మరో నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం నిశ్చయమైందా? అనడిగితే...

అక్కినేని కుటుంబంలో మరో నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం నిశ్చయమైందా? అనడిగితే... ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు ‘యస్‌’ అంటున్నాయి. అక్కినేని నాగచైతన్య (చైతు), సమంత లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల చిన్న కుమారుడు అఖిల్‌తో శ్రియా భూపాల్‌ నిశ్చితార్థం జరిపించిన నాగార్జున వచ్చే ఏడాది చైతూ, సమంతల నిశ్చితార్థం జరిపించనున్నారట. అఖిల్‌ నిశ్చితార్థం పూర్తయిన తర్వాత చైతూ–సమంతల నిశ్చితార్థం, పెళ్లి గురించి చర్చ మొదలైంది.

వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ వేర్వేరు సందర్భాలలో చెప్పిన విషయం విదితమే. తాజా సమాచారం ప్రకారం... జనవరి 29న కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చైతూ, సమంతల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట! అఖిల్‌–శ్రియాల వివాహం ఇటలీలో జరగనుంది. తమ్ముడి తరహాలో చైతూ కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి మొగ్గు చూపుతున్నారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement