ఉయ్యాలవాడలోకి వస్తారా? | who is the 3rd heroine of uyyalawada narasimha reddy | Sakshi
Sakshi News home page

ఉయ్యాలవాడలోకి వస్తారా?

Jun 19 2017 12:46 AM | Updated on Sep 5 2017 1:56 PM

ఉయ్యాలవాడలోకి   వస్తారా?

ఉయ్యాలవాడలోకి వస్తారా?

అనుష్కా శెట్టి, ప్రియాంకా చోప్రా మనసుల్లో ఉయ్యాలవాడలోకి రావాలనుందో? లేదో? గానీ... వీళ్లిద్దర్నీ తీసుకురావాలని చిరంజీవి అండ్‌ కో తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

అనుష్కా శెట్టి, ప్రియాంకా చోప్రా మనసుల్లో ఉయ్యాలవాడలోకి రావాలనుందో? లేదో? గానీ... వీళ్లిద్దర్నీ తీసుకురావాలని చిరంజీవి అండ్‌ కో తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మించనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో ముగ్గురు కథానాయికలకు చోటుంది. మామూలు కమర్షియల్‌ సినిమా అయితే... ఎవరో ఒకర్ని ఎంపిక చేసే వీలుంటుంది. కానీ, ఇదేమో చారిత్రక కథతో రూపొందనున్న సినిమా.

అందుకే, ఆచి తూచి అడుగులు వేస్తున్నారట! ఆల్రెడీ ఓ హీరోయిన్‌ క్యారెక్టర్‌కు ఐశ్వర్యారాయ్‌ను సంప్రదించారనే వార్త షికారు చేస్తోంది. మిగతా ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు అనుష్క, ప్రియాంకలను సంప్రదించారట! ‘బాహుబలి, రుద్రమదేవి’ సినిమాలతో చారిత్రక సినిమాలకు అనుష్క పర్‌ఫెక్ట్‌ అనే పేరొచ్చింది. పైగా, ‘స్టాలిన్‌’లో చిరు పక్కన ఓ సాంగ్‌ చేసినప్పుడు ఇద్దరి జోడీ బాగుందన్నారు. ఆల్రెడీ అనుష్కను ‘ఉయ్యాలవాడ..’ టీమ్‌ అప్రోచ్‌ అయ్యారట. ఐష్‌తో పాటు మరో హీరోయిన్‌ పాత్రకు ప్రియాంకను తీసుకుంటే సినిమాకు ఇంటర్నేషనల్‌ లుక్‌ వస్తుందనుకుంటున్నారట. మరి, వీళ్లు ఏమంటారో? వీళ్లతో పాటు ‘లింగ’లో రజనీకాంత్‌కు జోడీగా నటించిన హిందీ హీరోయిన్‌ సోనాక్షీ సిన్హా పేరు కూడా పరిశీలనలో ఉందట! సినిమా సెట్స్‌పైకి వెళ్లేసరికి ఎవరు ఫైనలైజ్‌ అవుతారో!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement